మీ ఫోన్ ఆన్ అవడం లేదా, అయితే ఈ లోపం ఉన్నట్లే 

ఒక్కోసారి హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తినపుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవకుండా మొరాయిస్తుంటుంది. సమస్య ఫోన్ హార్డ్‌వేర్‌లో ఉన్నట్లయితే మీకు మీరుగా పరిష్కరించుకోవటం కష్టతరమవుతుంది. సాఫ్ట్‌వేర్‌లో ఫోన్ సమస్య ఉన్నట్లయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ఫోన్‌ను తిరిగి ఆన్ చేయవచ్చు. అదెలాగో చూద్దాం. 

బ్యాటరీ డెడ్ అయినప్పుడు మీ ఫోన్ టర్నాఫ్ అయినట్లయితే, "empty battery"తో ఉన్న మీ ఫోన్ ను 10 నుంచి 15 నిమిషాల పాటు క్విక్ చార్జ్ చేయండి. ఆ తరువాత ఫోన్ ఆన్ చేసి చూడండి. సమస్య డెడ్ బ్యాటరీ కారణంగా ఏర్పడినట్లయితే వెంటనే సద్దుమణిగిపోతుంది.

మీ ఫోన్ హ్యాంగ్ అయిందన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్థారించుకున్న తరువాత ముందుగా చేయవల్సిన పని ఫోన్‌ను స్విచాఫ్ చేయండి. ఫోన్ స్విచాఫ్‌కు సహకరించని పక్షంలో బ్యాటరీని తొలగించండి. ఓ నిమిషం తరువాత బ్యాటరీని ఎదా స్థానంలో ఉంచి ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. చాలా సందర్భాల్లో ఈ ట్రిక్ పనిచేస్తుంది. మీ ఫోన్ తరచూ హ్యాంగింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి.

మీ ఫోన్‌లో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉన్నట్లయితే, పవర్ బటన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వండి. 30 సెకన్లు అంతకన్నా ఎక్కువ సేపు పవర్ బటన్‌‍ను హోల్డ్ చేసి ఉంచటం వల్ల బ్యాటరీ నుంచి ఫోన్‌కు వెళ్లే పవర్ పూర్తిగా కట్ అవుతుంది. కొద్ది సెకన్ల తరువాత ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. సమస్య పరిష్కారం కావొచ్చు.

రికవరీ మోడ్‌లో ఫ్యాక్టరీ రీసెట్‌ను నిర్వహించటం ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్ సేఫ్ మోడ్‌లో రీబూట్ అవుతుంది. తద్వారా ఫోన్ అవ్వొచ్చు. ఫోన్ బటన్‌లను ఏకకాలంలో హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ సజావుగా సాగదు. కాబట్టి, మీ ఫోన్ తయారీదారు ప్రొవైడ్ చేసిన ఆండ్రాయిడ్ ఫిర్మ్‌వేర్‌ను తిరిగి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఫోన్‌లో అనేక రకాల యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తుంటాం. ఈ యాప్‌లు డివైస్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేసి ఫోన్ వేగాన్ని పూర్తిగా తగ్గించి వేస్తాయి. ఫోన్‌లు హ్యాంగ్ అవటానికి కూడా ప్రధాన కారణం ఇవే. కాబట్టి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగానూ అదే సమయంలో క్లీన్‌‍గా ఉంచేందుకు ప్రయత్నం చేయండి.

హార్డ్‌వేర్ సాఫ్ట్‌వేర్‌ మొబైల్స్ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ డెడ్ పవర్ బటన్ ఫోన్‌ స్విచాఫ్ ఫోన్ హ్యాంగ్Â